రైతులు వివరాలను అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లో నమోదు చేయాలి
1 min read
న్యూస్ నేడు హొళగుంద : గురువారంహొళగుంద మండలంలోని అన్ని గ్రామాలు ఆర్ఎస్కేల సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ వారి అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు అందరూ ఆర్ఎస్కే సిబ్బంది గ్రామాల పరిధిలో భూసార పరీక్షలకు సంబంధించిన శాంపిల్స్ కలెక్షన్ చేసి వ్యవసాయ అధికారి వారి కార్యాలయంలో ఇవ్వాలి సిసిఆర్సి కార్డులో కౌలు రైతుల గుర్తింపు కార్డులు లకు సంబంధించిన రైతుల యొక్క వివరాలు సేకరించి ఆన్లైన్ నమోదు చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభవ వెబ్ లాగిన్ అందరికీ పంపడం జరిగింది కావున అందరు సిబ్బంది అర్హత గల రైతులు వివరాలను అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లో నమోదు చేయాలి ఈనెల 20వ తేదీ లోపల పూర్తి చేయాలి అలాగే మండలంలో ఉండే రైతులు పై సేవలను మీ గ్రామ వ్యవసాయ సిబ్బందిని లేక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాము .
