విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు…
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : (గడివేముల) మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను (కొర్రపోలురు సోమాపురం) గ్రామ రైతులు బుధవారం నాడు ముట్టడించారు వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం సాగుకు విద్యుత్ మూడు గంటలు. నాలుగు గంటలు .ఇస్తున్నారని పంటలు ఎండిపోతున్నాయని వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాదాపు గంటపాటు రైతులు నిరసన వ్యక్తం చేశారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని. ఏ ఈ. హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే మరోపక్క విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పొలాలకు ఇవ్వాల్సిన విద్యుత్తు సమయపాలన లేకుండా గంట రెండు గంటలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సంఘీభావంగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.