NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద్ర‌వ్యోల్బ‌ణ భ‌యాలు.. సూచీల్లో హెచ్చుతగ్గులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు హెచ్చుత‌గ్గుల న‌డుమ కొన‌సాగుతున్నాయి. ఉద‌యం లాభాల్లో ప్రారంభ‌మైన సూచీలు 12 గంట‌ల స‌మ‌యంలో ఫ్లాట్ గా కొన‌సాగుతున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణ భ‌యాలు మార్కెట్ల‌ను వెంటాడుతున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉండ‌నుంద‌న్న ఆర్థిక వేత్త‌ల అంచ‌నాల‌తో సూచీలు పెద్ద ఎత్తున క‌రెక్ష‌న్ కు గుర‌వుతున్నాయి. ఏసియా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. భార‌త సూచీలు స్వ‌ల్ప న‌ష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 65 పాయింట్ల న‌ష్టంతో 58511 వ‌ద్ద‌, నిఫ్టీ 7 పాయింట్ల స్వ‌ల్ప న‌ష్టంతో 17524 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి.

                                 

About Author