PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్నుల పండుగ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

1 min read

– చౌడేశ్వరి ఆలయంలో శ్రీ గాయత్రీ దేవి దేవి అలంకారం

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు:  దసరా శరన్నవరాత్రు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన చెన్నూరులో దసరా ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. రెండవ రోజు చెన్నూరు రామలింగ చౌడేశ్వరిదేవి  ఆలయంలో మంగళ వారం ఉదయం నుంచి అమ్మవారికి గణపతి పూజ అభిషేకములు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూడవ రోజు శ్రీ గాయత్రి దేవి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. రామనపల్లె శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి రెండవ రోజు కూడా వివిధ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

About Author