PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీలకతీతంగా పోరాడండి..

1 min read

– భూ బాధితులకు సిపిఎం నేతల పిలుపు..
పల్లెవెలుగు, వెబ్​ పాణ్యం: గ్రీన్ కో కంపెనీ పవర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన పిన్నాపురం బాధిత రైతులకు న్యాయం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ అధికారులు కలిసి రైతుల భూములను గ్రీన్ సోలార్ పరిశ్రమకు కట్ట పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న పిన్నాపురం గ్రామ బాధిత రైతులను శనివారం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షులు సద్దాం హుస్సేన్, జిల్లా నాయకులు సుధాకర్ తదితరులు గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత రైతులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఆర్డిఓ బాధిత రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, సాగు చేసుకుంటున్న రైతులకు భూమి హక్కు కల్పిస్తామన్న అధికారుల హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన మేమున్నామని చెప్పుకునే ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భారత రైతులకు డబ్బులు ఇప్పించకుండా ఎన్ని రోజులు ఏం చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఎవరు ప్రయోజనం కోసం మీ ప్రయోజనం కోసమా గ్రీన్ కో కంపెనీ ప్రయోజనం కోసమా అంటూ నిలదీశారు. ఎవరికి తెలియకుండా 450 ఎకరాల సాగులో ఉన్న రైతుల భూమిని గ్రీన్ కో కంపెనీ కి కట్ట పెట్టేందుకు కుట్ర జరుగుతుందని రైతులు గమనించాలని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అధికారులు గ్రీన్ కో కంపెనీ గ్రామ రైతులను ప్రజలను మోసం చేస్తున్నాయనిఆయన ఆరోపించారు. గ్రామంలో ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసి ప్రజలలో చీలిక వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పోరాడాలని దీనికో కంపెనీకి ఫారెస్ట్ భూములు ఇచ్చింది. ప్రభుత్వానికి కంపెని రూ. 5లక్షలు చెల్లించిందని ఆ ఐదు లక్షలు ఎక్కడ పోయాయో చెప్పాలని ఆయన అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు 20 లక్షలు రావాలి. కానీ కేవలం 9 లక్షలు 10 లక్షలు 11 లక్షల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన అన్నారు. 20 లక్షల రూపాయల నష్టపరిహారం రైతులకు వచ్చిందా మరి ఎమ్మెల్యే చెప్పాలన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే వాస్తవాలను దాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వీలు లేకుండా పోలీసులను పెట్టి ఎవరు ఊరిలోకి రాకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు కంపెనీకి అమ్ముడుపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. కడ ఊపిరి ఉన్నంతవరకు ప్రజల కోసమే పోరాడుతామని.. కంపెనీలు ఇచ్చే కాసులకు అమ్ముడుపోయి ప్రజలను మోసం చేసే చరిత్ర సిపిఎం పార్టీకి లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. పిన్నాపురం గ్రామ గ్రీన్ కో కంపెనీ భూ భాదిత రైతులు ఐక్యంగా ఉండి పార్టీలకతీతంగా పోరాడి నష్టపరిహారం సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

About Author