దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు : చెన్నూరు మైనార్టీ ఎం ఆర్ డి కాలనీ కి చెందిన ఖాదరునిస (30) బుధవారం మృతి చెందడం జరిగింది, ఈ సమాచారాన్ని”వైస్సార్ సిపి యువ నాయకులు, అన్వర్ భాష, జుమన్, అబ్దుల్ రబ్, వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు బుధ వారం 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాదక్ అలీ, నూర్ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.