‘నాకు లవర్ ను వెతికిపెట్టండి’ !
1 min readపల్లెవెలుగు వెబ్ : తాగునీరు.. డ్రైనేజీ.. రోడ్ల సమస్య.. ఇలా ఏ సమస్య ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధికో, ఎమ్మెల్యేకో ఫిర్యాదు చేయడం చూశాం. కానీ ఓ యువకుడు ఏకంగా లవర్ ను సెట్ చేయమని ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ఇప్పుడిది వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాఝురా ఎమ్మెల్యే సుభాష్ ధోతే కు ఓ లేఖ వచ్చింది. భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరుతో మరాఠిలో లేఖ ఉంది. ‘ మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నాతో ఎవరూ మట్లాడటానికి ఇష్టపడటంలేదు. భవిష్యత్ లో నాకు లవర్ దొరుకుతుందనే నమ్మకం లేదు. తాగుబోతులకు దొరుకుతున్నారు కానీ నాలాంటి మంచి వారికి అమ్మాయిలు దొరకడంలేదు. దయచేసి మీ నియోజకవర్గంలోని అమ్మాయిలను ప్రోత్సహించండి ’ ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ఈ లేఖ పై ఎమ్మెల్యే ఆరా తీయగా.. ఆ పేరుతో ఎవరూ లేరని, వైరల్ చేయడానికి ఇలా చేశారని తేలింది.