PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ ఆక్సిజ‌న్ లెవెల్స్.. ఇలా ఫోన్ లో తెలుసుకోండి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన రెండోద‌శ విజృంభ‌ణ‌లో ఆక్సిజ‌న్ స‌మ‌స్య తీవ్రంగా త‌లెత్తింది. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజ‌న్ లెవెల్స్ ప‌డిపోవ‌డం.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల అవ‌స‌రం ఏర్పడ‌టం నిత్యం జ‌రుగుతూ ఉంది. ఆక్సిజ‌న్ లెవెల్స్ ను.. కోవిడ్ పేషెంట్లు, క‌రోన ల‌క్షణాలు ఉన్న వాళ్లు ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉంటే.. జాగ్రత్త ప‌డొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఆక్సిజ‌న్ స్థాయిలు తెలుసుకోవాలంటే.. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, ఆక్సిజ‌న్ లెవెల్స్ తెలిపే స్మార్ట్ వాచ్ లు తీసుకోవాలి. వీటి ధ‌ర ఎక్కువ
గా ఉంటుంది. సామాన్యులు కొనాలంటే ఇబ్బంది ప‌డ‌తారు. వీటికి డిమాండ్ పెర‌గ‌డంతో ధ‌ర‌లు కూడ అమాంతం పెరిగాయి. వీటిని కొన‌లేని స్థితి సామాన్యుల‌కు ఏర్పడింది. ఈ ఇబ్బందిని గ‌మ‌నించిన ‘ కేర్ నౌ హెల్త్ కేర్ ’ సంస్థ.. కేర్ ఫ్లిక్స్ వైట‌ల్స్ యాప్ ను త‌యారు చేసింది. ఈ యాప్ ద్వార మ‌న ఫోన్ లోనే మ‌న శ‌రీరంలోని ఆక్సిజ‌న్ లెవెల్స్ ను ఎప్పటిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. అలాగే ప‌ర్సనల్ కంప్యూట‌ర్స్ లో కూడ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం మీ ఫోన్ లో కేర్ ఫ్లిక్స్ వైట‌ల్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని… మీ ఆక్సిజ‌న్ లెవెల్స్ ను ఎప్పటిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ జాగ్రత్త ప‌డండి.

About Author