నిబంధనలకు విరుద్ధంగా మోటార్ వాహనదారులకు జరిమానా,కౌన్సిలింగ్
1 min read
ఫైర్ స్టేషన్ సెంటర్ లో82 కేసులు నమోదు
ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో బుధవారం ద్విచక్ర వాహనాలపై వాహన తనిఖీ అధికారులు 82 కేసులు నమోదు చేశారు. తదనంతరం ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై ఉప రవాణా కమీషనరు షేక్ కరీమ్ అవగాహన కల్పించారు. ఇందులో హెల్మెట్ ధరించని, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని మరియు వాహన భీమా కలిగిలేని ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదయ్యాయి. హెల్మెట్ను, సీట్ బెల్ట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను మరియు లైసెన్స్ ఆవశ్యకతను కరీమ్ వాహన చోదకులకు వివరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రతీ యొక్క ద్విచక్ర వాహనదారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని కరీమ్ ద్విచక్ర వాహనదారులను కోరారు.ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు బి. భీమారావు, ఎస్.బి.శేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఎస్. జగదీష్ బాబు, వి.ఎల్. కళ్యాణి, డి. ప్రజ్ఞ పాల్గొన్నారు.