సీఎం పై ఎఫ్ఐఆర్
1 min readపల్లెవెలుగువెబ్ : చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బాఘెల్ పై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం సాగించిన నేపథ్యంలో గౌతమ్ బుద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిణామంపై భూపేష్ బాఘెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలో ఎన్నికల కమిషన్ డెమో ఇవ్వాలని, అప్పుడు ఈసీ చెప్పినట్టే చేస్తామని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.”అహ్రోహలో 5 రోజుల నుంచి బీజేపీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోంది. వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేదు. నేను నిన్న ఒక్క రోజు మాత్రమే ప్రచారం చేశాను. ఈసీ నిష్పాక్షికంగా ఉండాలి. నా ఒక్కరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమిటి? ఇలా అయితే ప్రచారం సాగించేదెలా? అమ్రోహిలో బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? మొదట్లోనే ఈసీ ఇలా వ్యవహరిస్తే ఎలా? మళ్లీ ఉత్తరప్రదేశ్ వెళ్తాను. నాయకులు ప్రచారం కాకుండా ఏం చేయాలి?” అని చత్తీస్‌గఢ్ సీఎం ప్రశ్నించారు.