49వ డివిజన్ లో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం
1 min read
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్న తీరుపై ప్రజలతో మమేకం
పెద్ద ఎత్తున పాల్గొన్న డివిజన్ ప్రజలు,టిడిపి శ్రేణులు
ప్రజా సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో “సుపరిపాలన లో తొలి అడుగు” అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు నగరంలో 49 డివిజన్ తంగెళ్ళ మూడి ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదా అని ప్రభుత్వాధికారులతో ప్రజల మధ్యకు వెళ్లి తెలుసుకున్నారు. పథకాలు ఇంకా అందని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయానికి రావలసిందిగా కోరారు. అధికారులతో తక్షణమే చర్చించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుచున్నదని భరోసా కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే చంటి రాకతో డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,ఈడ చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్,ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎన్ ఆర్ పెదబాబు,మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు టిడిపి ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం నాయుడు, మాజీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్ధాని శ్రీనివాస్,టిడిపి ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేటర్ దేవర కొండ శ్రీనివాస్,డివిజన్ ఇంచార్జీలు,నెరుసు గంగరాజు,క్లస్ట్ ఇన్చార్జీ లు, ప్రభుత్వ అధికారులు, టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగినది.
