NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోళ్లపాడులో ప్రకృతి వ్యవసాయంపై ప్రజలకు అవగాహన..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రకృతి వ్యవసాయం డివిజన్ ఇన్చార్జి అయ్యస్వామి రైతులకు పొలాల్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా  నిర్జీవంలో ఉన్నటువంటి పొలాలను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పీఎండిఎస్ పద్ధతిలో తొలకరి చినుకులకు ముందు నవధాన్యాల సాగులో చిరుధాన్యాలు,తృణధాన్యాలు పప్పు దినుసులు,పచ్చి రొట్టె, ఎరువులు,నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు,ఆకుకూరలు, కూరగాయలు 25 నుండి 30 రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి  చేసి విత్తన గుళికలుగా తయారు చేసుకుని భూమిలో వేసుకున్నట్లయితే 40 నుండి 45 రోజుల వ్యవధిలో మనము పశువులకు మేతగా వాడుకోవచ్చు మరియు మనం భూమిలో పచ్చి రొట్టె ఎరువుగా వాడుకున్నట్లయితే భూమి సారవంతం పెరిగి భూమిలో అన్ని రకాల సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది మొక్కలకు కావలసిన పోషక విలువలు అందించడంలో సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి  అలాగే భూమిలో భూమిలో కర్బన శాతం పెరిగి మనం వేసే ప్రధాన పంటల్లో కలుపు శాతం తగ్గి పురుగు తెగుళ్లు ఉద్రిక్తత తగ్గి పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగడానికి అవకాశం ఉందని రైతులకు సూచించారు. కావునా ఈ విధంగా గ్రామంలో 20 మంది రైతులకు గ్రీన్ కో సంస్థ వారు శివప్రసాద్/భాష ఆధ్వర్యంలో పీఎండిఎస్ కిట్లను పంపిణీ చేశారు.ఈ విధంగా రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో మోహన రాజ్.ఎల్లయ్య, నాగన్న,సుబ్బయ్య వారి పొలాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో దొరతి మాధవి చంద్రకళ,ఆంజనేయులు మరియు రైతులు పాల్గొన్నారు.

About Author