ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
1 min read

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్. డి. ఓ కార్యాలయం ముందు ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి
పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష
పత్తికొండ, న్యూస్ నేడు : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు,వసతి దీవెన బకాయిలు 6400 కోట్లు విడుదల చేయాలని పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో ఆర్. డి. ఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి, శివ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 6400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువ గళం పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే విద్యార్థుల కష్టాలు తీరుస్తామని, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలన బాగా జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు తప్ప విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మొదటిలో విద్యార్థులకు కావాల్సింది 6400 కోట్ల రూపాయలు అయితే 600 కోట్లు మాత్రమే విడుదల చేసిచేతులుదులుపు కున్నారని పేర్కొన్నారు.బడ్జెట్ సమావేశాలలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 2600 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి.

