చౌట్కూరులో ‘సుపరి పాలనలో తొలి అడుగు’
1 min read
సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించిన నాయకులు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం గత సంవత్సరం పాలనపై “సుపరిపాలన తొలి అడుగు”అనే కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. బుధవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు గ్రామ టీడీపీ నాయకులు ఈ నరసింహ గౌడ్,షబ్బు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి గత సంవత్సరం నుండి ఇప్పటి దాకా ప్రభుత్వం అందజేస్తున్న తల్లికి వందనం, అన్న క్యాంటీన్,త్వరలో అందజేస్తున్న వివిధ పథకాల ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు త్వరలోనే 20 వేలు వస్తుందని గ్రామ ప్రజలకు వివరిస్తూ పథకాల గురించి కరపత్రాలను వారు అందజేశారు.ఈ కార్యక్రమంలో కుంచెపు స్వాములు,తేనె మధు,స్వాములు,మరియ దాసు,వేల్పుల మౌలాలి, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు.