విద్యా ఉపాధికై ఉద్యమిద్దాం… డివైఎఫ్ఐ
1 min read

జూలై 11,12 కర్నూలులో జరుగు డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.
పత్తికొండ , న్యూస్ నేడు: అందరికీ విద్య ఉపాధికై ఐక్యంగా ఉద్యమిద్దమని బూటకపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వాల వైఖరిపై యువత పోరాటాలకు సిద్ధంగా ఉండాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర పిలుపునిచ్చారు.బుధవారం నాడు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో డివైఎఫ్ఐ మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు యన్ .పెద రాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, సిఐటియు మండల కార్యదర్శి అశోక్, రైతు సంఘం జిల్లా నాయకులు సూరి లు మాట్లాడుతూ 1980 నవంబర్ లో భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్,అల్లూరి సీతారామరాజు,అంబేద్కర్ వంటి మహానీయుల స్ఫూర్తితో డివైఎఫ్ఐ పనిచేస్తుందని వారు తెలిపారు.దేశంలో ప్రధానంగా యువతీ,యువకులను కూడగట్టి విద్య ఉపాధి మౌలిక సదుపాయాలపై ఉద్యమిస్తుందని వారు పేర్కొన్నారు. యువత మంచి మార్గంలో నడిపించడానికి నిరంతరం పనిచేసే సంఘం డివైఎఫ్ఐ అని,స్థానికంగా ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేసి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాడే సంఘం డివైఎఫ్ఐ అని వారు స్పష్టం చేశారు.ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో పాలకుల విధానాల వల్ల రోజురోజుకి నిరుద్యోగం పెరిగిపోతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్,కార్పొరేట్ పరం చేయడం వల్ల డిగ్రీలు,పీజీలు,బిటెక్ లు చేసిన యువత స్థానికంగా పరిశ్రమలు లేక వారి చదువుకు తగ్గ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని,దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు కూలిపని చేసుకునేవారు.

