ఆటో డ్రైవర్లకు…. వాహనదారులకు స్పెషల్ డ్రైవ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ ట్రాఫిక్ డిఎస్పి ఎం నాగభూషణం ఆధ్వర్యంలో కర్నూల్ టౌన్ లోని ప్యాసింజర్స్ ను ఎక్కించుకొని వెళ్లే ఆటో డ్రైవర్లు వారి యొక్క ఆటోలను హెవీ సౌండ్స్ వచ్చే హరన్స్ పెట్టుకొని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆరన్సును ఆటోలకు పెట్టుకుని నడిపేటువంటి దాదాపు 1000 హరన్స్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ తమ యొక్క వాహనాలను ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్ పెట్టుకొని కర్నూల్ టౌన్ నందు నడుపుతున్నటువంటి 15 మోటార్ సైకిల్ వాహనాలను వాటి సైలెన్సర్లను కూడా తీయించి మోటర్ ట్రాన్స్పోర్ట్ వారు ఇచ్చిన పాత సైలెన్సర్స్ వేసి పంపడమైనది ఈరోజు ట్రాఫిక్ స్టేషన్ దగ్గర అన్నిటిని రోడ్డు రోలర్ ద్వారా ఎక్కించి అన్నిటిని ధ్వంసం చేయడమైనదిఇకమీదట ఇలాంటి హారాన్స్ గాని సైలెన్సర్లు గానీ పెట్టుకొని నడిపేటువంటి ఆటో డ్రైవర్లకు మరియు వాహనదారులు స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీస్ వారికి దొరికితే కోర్టు ద్వారా చట్టపరమైన చర్య తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పి తెలపడం అయినది.