మంత్రి బొత్సను కలిసిన గూడురు చైర్మన్, వైస్ చైర్మన్లు – సమ్మర్ స్టోరేజ్, డంపు యార్డ్, బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని వినతి పల్లెవెలుగు వెబ్, గూడూరు: గూడూరు నగర పంచాయతీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలని పంచాయతీచైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు . బుధవారం విజయవాడలో కర్నూలు నగర మేయర్ బీవై రామయ్యతో పాటు గూడురు చైర్మన్, వైస్చైర్మన్లు మంత్సిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గూడురు నగర పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. నగర పంచాయతీ గా మారిన తర్వాత జనాభా సంఖ్యకు తగ్గట్టు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, అందుకు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని, అలాగే డంపింగ్ యార్డు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు దీనికి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుకూలంగా స్పందించి త్వరలోనే గూడూరు నగర పంచాయతీ సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చైర్మన్ వైస్ చైర్మన్ తెలిపారు.