వృద్ధుల సంక్షేమం కోసం.. నేషనల్ Elder హెల్ప్లైన్ 14567
1 min read– జాయింట్ కలెక్టర్( వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వృద్ధుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం నేషనల్ Elder హెల్ప్లైన్ 14567 తీసుకురావడం సంతోషకరమన్నారు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు. శుక్రవారం కర్నూలు యునెటైడ్ క్లబ్లో జిల్లా లోక్ అదాలత్ జడ్జి మరియు జేసీ చేతుల మీదుగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నేషనల్ Elder హెల్ప్లైన్ 14567 లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జేసీ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధుల క్షేమం కోసం భారత ప్రభుత్వం వారు హెల్ప్లైన్ తీసుకురావడం సంతోషకరమని, ఈ బాధ్యతను హెల్ప్ ఏజ్ ఇండియా వారికి అప్పజెప్పడం శుభపరిణామమన్నారు. ‘ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ హెల్ప్లైన్ ద్వారా పరిష్కారం పొందగలరు భావిస్తున్నానన్నారు. అదేవిధంగా హెల్ప్ ఏజ్ ఇండియా ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నారాయణ helpline 14567 ప్రాముఖ్యత మరియు పని చేసే విధానం గురించి వివరించారు.
అనంతరం జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం అడిషనల్ డైరెక్టర్ పి.విజయ మాట్లాడుతూ వృద్ధుల కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ తరువాత వృద్ధులకు వీల్ చైర్స్, దుప్పట్లు ,వినికిడి యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సహదేవరెడ్డి,సెక్రటరీ నాగరాజు మరియు కమిటీవారు వయోవృద్ధులు పాల్గొన్నారు.