తీన్మార్ మల్లన్నకు స్వాగతం: ఎంపీ ధర్మపురి అరవింద్
1 min read

పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: తీన్మార్ మల్లను బీజేపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లను దర్శనార్థం వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఆలయ అధికారులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో లవన్న స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు. దేవాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ.. హిందూ స్థాపనకు కృషి చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న బీజేపీలోకి రావడం సంతోషకరమని, తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు.

