NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుమ‌ల‌కు వెళ్లేవారికి .. ఇవి తప్ప‌నిస‌రి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ కీల‌క సూచ‌న‌లు చేసింది. తిరుమ‌ల‌కు వెళ్లేవారికి కోవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. ద‌ర్శ‌నానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష నెగిటివ్ రిపోర్ట్ కూడ ఉండాల‌ని సూచించింది. వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ అలిపిరి వ‌ద్ద చూపిన వారికి మాత్ర‌మే తిరుమ‌ల ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తామ‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. ఉద్యోగులు, భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఇలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు.

                               

About Author