గ్రాస్ ఎన్రోల్మెంట్ పై కమిటీ ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో ఆరు సంవత్సరాల నుండి, 18 సంవత్సరాల వయసు గల ఎన్రోల్మెంట్ కానీ పిల్లలు 271 మంది గుర్తించడం జరిగిందని వీరందరూ కూడా ఎన్రోల్మెంట్ అయ్యేవిధంగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు తెలిపారు, గురువారం మధ్యాహ్నం స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఉన్న 271 మంది పిల్లలను ఎన్రోల్మెంట్ అయ్యేవిధంగా ఉపాధ్యాయులు పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు, దీనికిగాను ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు, సచివాలయ స్థాయిలో ఈ కమిటీ ఉంటుందని ఇందులో హెడ్మాస్టరు, మహిళా పోలీస్, ఒక వాలంటీర్ ఉండడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కమిటీ గ్రామాలలోకి వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఎన్రోల్మెంట్ అయ్యేవిధంగా చూడడం జరుగుతుందన్నారు, ఎం ఈ ఓ గంగిరెడ్డి మాట్లాడుతూ, అందరి సహాయ సహకారాలతో వీలైనంత త్వరగా ఎన్రోల్మెంట్ జరిగే విధంగా చూడాలని తెలిపారు, ఎంఈఓ 2 సునీత మాట్లాడుతూ జి ఈ ఆర్( గ్రాస్ ఎంట్రోల్మెంట్ రేషన్) యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసి ఉంటుందని, దీనికి సంబంధించి కమిటీ సభ్యులు అందరూ కూడా ఎన్రోల్మెంట్ కు సహకరించి ప్రతి ఒక్కరిని ఎన్రోల్మెంట్ అయ్యేవిధంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.