PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి రాజీనామా !

1 min read

పల్లెవెలుగువెబ్ : గోవా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి గురైన లక్ష్మీకాంత్ పర్సేకర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలోని పదవులన్నింటికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. మాండ్రెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ”నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. నావద్ద ప్రజల టిక్కెట్ ఉంది. ప్రజలు పోటీ చేయమని కోరుకుంటున్నారు. అందుకోసం నేను సిద్ధమవుతున్నాను. పార్టీకి చెందిన పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రెండు రోజులు సమయం కోరాను. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను” అని పర్సేకర్ మీడియాకు తెలిపారు.

         

About Author