NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలపర్రు టోల్గేట్ వద్ద వాహనదారులకు హెల్మెట్ వాడకంపై సూచనలు సలహాలు

1 min read

జిల్లా ఎస్పీ,నూజివీడు డి.ఎస్.పి ఆదేశాలతో వాహనదారులకు అవగాహన కార్యక్రమం

సురక్షితంగా ఇంటికి చేరి కుటుంబాని ఆనందాన్ని పంచాలి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డిఎస్పీ  కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల పై కలపర్రు టోల్ గేట్ వద్ద శుక్రవారం హెల్మెట్ అవగాహన కార్యక్రమమo నిర్వహించారు.  పెద పాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్  యొక్క సిబ్బంది.పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్  సిబ్బంది తో కలపర్రు టోల్ గేట్ వద్ద బైక్ రైడర్ల కు హెల్మెట్ అవగాహన నిర్వహించారు.స్థానికంగానే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటు వంటి వారికి జరిమానా విధించ కుండా హెల్మెట్ లను కొనుగోలు చేయించారు.హైవేపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చాలా ప్రమాదకరం, ప్రాణాలకు హాని కలిగి స్తుందని కుటుంబం ఇబ్బందులు గురవుతుందని, సురక్షితంగా ఇంటికి చేరి కుటుంబానికి ఆనందం కలిగించాలని  తెలియ జేశారు.కారు డ్రైవర్లకు సీట్ బెల్ట్ తప్పనిసరి అని సూచించారు.మీ కుటుంబం మీతో ఎదురు చూస్తోంది, అతివేగం, నిర్లక్ష్యం వల్ల మీకు, ఇతరులకు ప్రమాదాలు జరుగుతాయి. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరండి అని పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ స్పష్టం చేసినారు.

About Author