వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక
1 min read
ఎమ్మిగనూరు పల్లెవెలుగు న్యూస్.ఎమ్మిగనూరు పట్టణం
ఎమ్మిగనూరులో వంద పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన బుట్టా రేణుకగారు
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని వంద పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు పరిశీలించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుకగారు, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠగారు, యువ నాయకుడు బుట్టా ప్రతుల్ . నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించిన అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి అపూర్వమైన నిధులను కేటాయించి, శక్తివంతమైన సదుపాయాలు కలిగిన ఆసుపత్రులు నిర్మానాలు జరిగాయని, ఎమ్మిగనూరులో రూ.12.60 కోట్ల వ్యయంతో 03.04.2020 తేదీన అప్పటి ఎమ్మెల్యే శ్రీ కె చెన్నకేశవ రెడ్డి భూమి పూజ చేసి పనులు పరంభించడం జరిగిందని. నిర్మించిన వంద పడకల ఆసుపత్రి, వైద్య రంగ ప్రగతికి ప్రతీకగా నిలుస్తుంది. అప్పటికే ఆసుపత్రి అంతర్గత పనులు పూర్తయ్యి, మౌలిక వసతుల ఏర్పాటుకు తుది దశకు చేరుకుంది. కానీ, మేము ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఈ ఆసుపత్రిని, ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేకపోయాము,” అని ఆమె వివరించారు.“టీడీపీ హయాంలో మిషన్ షెల్ఫ్ పై పెట్టిన ఫైళ్లతో పాటు, ఎన్నో శిలాఫలకాలను మాత్రమే ప్రజలకు చూపిస్తూ మభ్యపెట్టే నాటకాలు జరిగాయి. 2003లో బీవీ మోహనరెడ్డి, 2019లో బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కానీ నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయలేదు. ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి ఎన్నికల ముందు హడావుడిగా చేసిన కార్యక్రమాలు కేవలం రాజకీయ మాయాజాలమే.“వాస్తవానికి, టీడీపీ నేతలకు అభివృద్ధిపై అవగాహన లేకుండా, ప్రచారాలకే పరిమితమయ్యారు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆసుపత్రి భవనం అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. వైద్య విభాగాల్లో. పీరాట్రిస్ జనరల్. మెడిసిన్ ఆర్థోపెటిస్ ఈఎన్టీ సి అనస్తీశ జనరల్. సర్జరీ. సైకియాట్రీ రేడియాలజీ. వంటి. విభాగాల. ఏర్పాటుకు ప్రత్యేక వైద్యుల్ని నియమించాం. ఇప్పటికే 105 మందికి పైగా వైద్య సిబ్బంది నియమితులయ్యారు,” అని ఆమె పేర్కొన్నారు.మానవతా విలువలపై రాజీ పడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “టీడీపీ నేతలు ప్రజల ఆరోగ్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకే తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణం పూర్తి అయినా భవనానికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రారంభించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకెళ్ళేవారు. వైద్య సదుపాయాల కల్పన మాటల్లో కాదు, కార్యాచరణలో చూపిస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది,” అని బుట్టా రేణుకగారు పేర్కొన్నారు.“టీడీపీ వదిలేసిన శంకుస్థాపనలకు జీవం పోసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అభివృద్ధి అంటే పచ్చబొట్టులా ముద్రపడినది జగన్ పాలనలో మాత్రమే. ప్రజల బతుకు, ఆరోగ్యం, అవసరాల పట్ల నిజమైన కర్తవ్యబోధ ఉన్నదీ పార్టీ మాత్రమే,” అని ఆమె వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు,ఇంచార్జులు,రాష్ట్ర స్థాయి నాయకులు,జిల్లా స్థాయి నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,పట్టణ/మండల స్థాయి నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
