ఇందూరి ప్రతాప్ రెడ్డి ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల ఉదయనంద హాస్పిటల్ లో గోవిందపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డి ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి …!!ఈరోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం : గోవిందపల్లి గ్రామానికి చెందిన శిరివెళ్ల మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఇందూరి ప్రతాప్ రెడ్డి పై అదే గ్రామంలో ఉన్న రామాలయంలో పూజ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు.తీవ్ర గాయాలతో ఉన్న ఇందూరి ప్రతాప్ రెడ్డిని నంద్యాలలోని ఉదయానంద హాస్పిటల్ కు తరలించారు.. విషయం తెలుసుకున్న వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఉదయానంద హాస్పిటల్ కు వెళ్లి ఇందూరి ప్రతాప్ రెడ్డిని పరామర్శించి డాక్టర్ల ను ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ ని కలవడం జరిగింది.