NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా పరిష్కార వేదికలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాలు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజా పరిష్కార వేదిక వద్ద ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ప్రభుత్వ హోమియోపతి, ఆయుష్, యునాని వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.ప్రభుత్వ హోమియోపతి వైద్యశాఖ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ భారతీదేవి, ఆయుష్ వైద్యశాఖ అధికారి డాక్టర్ సుమలత, ప్రభుత్వ యునాని వైద్య శిబిరం అధికారి డాక్టర్ జి. చంద్రిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిబిరాల్లో పలువురు ప్రజలు పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించారు. వైద్యులు వారికి అవసరమైన ఆరోగ్య సూచనలు అందించడంతో పాటు, ఆయా వైద్య విధానాలకు అనుగుణంగా మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడం ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు  ప్రజలకు వైద్య సేవలు అందించడమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *