శారీరక విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్ళు ఉచిత పంపిణీ
1 min read

అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో అర్హులైన ప్రతీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలు వద్ద సోమవారం (1) బొర్రా సుదాకరమ్మ, (2) షేక్ ఇస్మాయిల్ యిద్దరు విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్లను, ఇద్దరు వయోవృద్ధులు చేతి కర్రలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందించడం జరుగుతుందని, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. రామ్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.

