NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత కంటి వైద్య సేవలు… భేష్!

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క సేవలు బాగున్నాయని సీనియర్ లెక్చరర్ వీరేశప్ప, తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ సుధాకర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…  చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి వారు అత్యాధునిక పరికరాలతో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వీరేశప్ప మరియు స్కూల్ అసిస్టెంట్ సుధాకర్ గౌడ్  ప్రజలకు అన్నదానం, బెంగళూరు వాసవి అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు సీతారామ్ వారు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉదయం 21 మందికి ఆపరేషన్ లు మరియు దాదాపు 132 మందికి వైద్య పరీక్షలు చేశామని శంకర నేత్రాలయ ఆసుపత్రి కోఆర్డినేటర్స్ అరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యులు మధు, రమేష్, గిరి, జిలాన్, రాజేశ్వరి, వాలంటీర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *