NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల సమస్యలను త్వరి తగతిన, పారదర్శకంగా పరిష్క రించడమే మా లక్ష్యం

1 min read

ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారు ఆదేశం

సత్య సాయి ట్రస్ట్ వారు భోజన సదు పాయాలను ఏర్పాటు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రజల సమస్య ల పరిష్కారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాల యంలో పబ్లిక్ గ్రీవెన్స్ ను ఏలూరు జిల్లా ఎస్పీ  కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నిర్వహించారు. ప్రజల యొక్క సమస్యలను త్వరి తగతిన, పారదర్శకంగా పరిష్క రించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక’ కార్య క్రమం జరిగింది. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్,ఏ ఆర్ అదనపు ఎస్పీ జి.ముని రాజా తో కలిసి ఫిర్యాదు దారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం పూర్తిగా పేపర్ లెస్  పద్ధతి లో, పారదర్శ కమైన ఆన్‌లైన్ విధానంలో నిర్వహిం చినారు.మొత్తం 39 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.ఎస్పీ స్వయంగా ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా  విన్నారు. సదరు ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారు లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మరిన్ని వెసులుబాటులను ఎస్పీ  వివరించారు.డబ్బు, సమయం వృథా చేసుకోకుండా నేరుగా సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు తెలిపారు.ప్రజలు చేసిన ఫిర్యాదుల స్థితిగతు లను  తెలుసు కోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.జిల్లా నలు మూలల నుండి వచ్చినటు వంటి ఫిర్యాదు దారులకు ఏలూరు శ్రీ సత్య సాయి ట్రస్ట్ వారు భోజన సదు పాయాలను ఏర్పాటు చేసినారు.

About Author