NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆశ్రమం హాస్పిటల్స్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1 min read

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక పవర్ పేట లోని శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆశ్రమo హాస్పిటల్స్  నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) వైద్య పరీక్షలు చేయించుకున్నవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అవసరార్థులకు ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా చేయూతను అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ  అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి వైద్యులు ఈ వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

About Author