NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటర్ల మ్యాపింగ్‌కు సమిష్టి సహకారం అవసరం

1 min read

కర్నూలు ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు , న్యూస్​ నేడు:  గురువారం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమిష్టిగా సహకరించాల్సిన అవసరం ఉందని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ కోరారు. గురువారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమం చురుకుగా కొనసాగుతోందని, ఇందులో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బిఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు, విద్యార్థుల్లో ఓటర్ల నమోదు, మ్యాపింగ్‌పై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి మేనేజర్, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author