హరిజన బస్తీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
1 min read– సర్వేంద్రయాణాం నయనం ప్రధానం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మానవ శరీరంలోని ఇంద్రియాలన్నిటిలోనూ నేత్రాలు(కళ్ళు) అతి ముఖ్యమైనవని అటువంటి నేత్రాలకు వచ్చే జబ్బులను నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడం తో పాటు శస్త్రచికిత్స తో పాటు ఉచితంగా కంటి అద్దములు అందించడం ఎంతో గొప్పసేవ అని అటువంటి సేవను ప్రముఖ నేత్ర వైద్యులు డా.సుధాకర రావు గారి ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ – సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంయుక్త సౌజన్యంతో…విశ్వహిందూ పరిషత్,శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రఖంఢ ఆధ్వర్యంలో….బుధవార పేట లోని శివాలయం వీధిలోని జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో “ఉచిత వైద్య శిబిరం” సందర్భంగా జరిగిన సభలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ అన్నారు…నేత్రవైద్యనిపుణులు డా.సుధాకర రావు మాట్లాడుతూ ఎన్నో సం.లుగా తాను నేత్ర వైద్యునిగా ఉన్నా ఇలా ఉచిత నేత్ర వైద్యం అందించినపుడు కలిగే ఆనందం,తృప్తి చాలా ఎక్కువని ఇప్పుడు ఉన్న ధరల దృష్ట్యా కంటి ఆపరేషన్ నిరుపేదలు అందుబాటులో లేని కారణంగా తాను ఈ చిన్న సేవను సుశీల నేత్రాలయం ద్వారా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి శ్రీ గుమ్మళ్ళ సత్యం గారికి కంటిపరిక్ష చేయడంతో ఉచిత వైద్యశిబిరం ప్రారంభమైనది సుమారు 120 మందికి ఉచితంగా పరిక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని,వారికి కంటి అద్లములు కూడా ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలియజేశారు….ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ అనంత విశ్వప్రసాద్,నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి,మాజీ గ్రంథాలయం ఛైర్మెన్ కే.జీ.గంగాధర్ రెడ్డి,నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, కార్యదర్శి ఈపూరి నాగరాజు,నగర సేవా ప్రముఖ్ రఘునాథ్ సింగ్,ప్రఖంఢ కార్యకర్తలు పాల్గొన్నారు.