NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరులో ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రంగ స్వామి ఆధ్వర్యంలో ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఎస్.జీయఫ్ సెక్రెటరీ పెరుమాళ్ళ శ్రీనాథ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ నందికొట్కూరు లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధపడటానికి ఈ స్టడీ హాల్ చాలా ఉపయోగపడుతుందని ఈ స్టడీ హాల్ ఏర్పాటు కొరకు అమెరికాలో ఉన్న విశ్రాంత డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీ కన్నా గారు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తాను కూడా ఈ స్టడీ హాల్ ఉపయోగార్ధము తన తండ్రి గారి పేరుమీద ఏర్పాటైన “రత్నం ఫౌండేషన్”ద్వారా ఉచితంగా కుర్చీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ భాస్కర్,సిపిఐ జిల్లా నాయకులు రఘురాంమూర్తి కార్యదర్శి శ్రీనివాసులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాజన్న,విజయ్,రియాజ్, నవీన్,సాగర్,తేజ,శ్రీరాములు పాల్గొన్నారు.

About Author