తక్షణమే ఆ కాలనీ పేదలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి
1 min read– 19వ వార్డులోని పార్థసారథి అపార్ట్మెంట్ పక్కన ఉన్న కొట్టాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి
– సిపిఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు 11 గంటలకి మున్సిపల్ కార్యాలయం ముందు కర్నూలు నగరంలోని 19 వ వార్డులో పార్థసారథి అపార్ట్మెంట్ ప్రక్కన ఉంటున్న 80 మంది పేద కుటుంబాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు కాలనీవాసులతో ఖాళీ బిందెలతో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ నగర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న త్రాగే మంచినీళ్ల కోసం ఇంకా కూడా ధర్నాలు జరుగుతున్నాయంటే మాన పాలకులు మన పట్ల ఏ విధంగా ఉన్నారో ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థమవుతోంది పార్థసారథి అపార్ట్మెంట్ పక్కన నివాసముంటున్న 80 మంది నిరుపేదలు దాదాపుగా 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డ్స్ కరెంటు మీటర్లు ఓటర్ కార్డ్స్ అన్ని వచ్చి ఉన్నాయి కానీ పార్థసారథి అపార్ట్మెంట్ ప్రక్కన కొట్టాలకు మున్సిపల్ అధికారులు కోర్టు ఆర్డర్ ని సాకుగా చూపి వారికి కనీసం త్రాగడానికి మంచినీళ్లు కూడా సప్లై చేయకపోవడం చాలా దురదృష్టకరం తక్షణమే ఆ కాలనీ పేదలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని ధర్నా చేస్తున్న ప్రజల దగ్గరికి వచ్చిన నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ తక్షణమే కొట్టాల ప్రజలకి మంచినీటి సౌకర్యాలు కల్పిస్తానని దానికోసం తగు చర్యలు తీసుకుంటామని శాశ్వత నివాసం కోసం కృషి చేస్తానని ధర్నా చేస్తున్న ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది ఆ కాలనీ ప్రజల సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్తూ గత 20 సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటున్నారు కనుక వారికి తక్షణమే రోడ్లు వేయాలని మురికి కాలువలు నిర్మించాలని మరుగుదొడ్లు నిర్మించాలని ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని మేయర్ని వారు కోరడం జరిగినది త్వరలోనే అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం లో సిపిఐ నగర సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు నగర కార్యవర్గ సభ్యులు బిసన్న నల్లన్న వైఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు గణేష్ నగర్ శాఖ కార్యదర్శి కుమార్ రాజా నగర నాయకులు రామచంద్ర మద్దిలేటి లక్ష్మి మరికొంతమంది మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.