PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శంకరాస్ ‘ లో… ఫ్రెషర్స్ డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు కళాశాల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్  ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బి తిమ్మయ్య   పాల్గొని విద్యార్థులు మంచి చదువులు చదువుకుని ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలని అప్పుడే తమ్ము అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుతారని అధ్యాపకుల నుంచి తెలియని విషయాలు తెలుసుకుని జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఆశించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు  మాట్లాడుతూ  కళాశాల నుంచి  విద్యార్థులకు కావలసినటువంటి వసతులు మరి వారి లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.విద్యార్థులు వారి యొక్క ఆశయాలు మరియు తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేర్చాలని కోరారు  అనంతరం విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ విత్ మై ,కళాశాల డైరెక్టర్ బి హరి కిషన్ ,ప్రిన్సిపల్ శ్రీనివాసులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author