వర్షాల కోసం పోతుదొడ్డి గ్రామంలో కప్ప ఊరేగింపు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామ చిన్నారులు శనివారం సంప్రదాయ పద్ధతిలో కప్పను ఊరేగించారు.గ్రామంలోని వీధుల గుండా కప్పను ఊరేగిస్తూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య చిన్నారులు పాల్గొని సంప్రదాయాన్ని కొనసాగించారు.వర్షాలు కురిసి గ్రామ ప్రజలతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

