ఇక నుంచి ఆర్టీవో ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్ ఉండదు..!
1 min readపల్లెవెలుగు వెబ్: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ఆర్టీవో ఆఫీసులో రవాణ అధికారుల ముందు డ్రైవింగ్ సామర్థ్యం నిరూపించుకోవాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేదని తాజాగా కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల్లో పొందుపరిచింది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే కేంద్రాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తే… లైసెన్స్ జారీ చేసే సమయంలో ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష లేకుండా లైసెన్స్ ఇచ్చేస్తారు. ఈ కొత్త నిబంధనలు జులై 1నుంచి అమల్లోకి రానున్నాయి.
Learning to drive a car. Driving school. Driver education.
నిబంధనలు:
- టూవీలర్, త్రీవీలర్, తేలికపాటి వాహనాలకు శిక్షణ ఇచ్చే అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు తప్పనిసరిగా ఒక ఎకరం స్థలం ఉండాలి.
- ద్విచక్ర, త్రిచక్ర, మీడియం, సరకు రవాణ వాహనాలు, భారీ ప్యాసింజర్, ట్రెయిలర్స్ నడపడంలో శిక్షణ ఇవ్వాలంటే…శిక్షణ కేంద్రానికి మూడెకరాలు స్థలం ఉండాలి.
- రెండు తరగతి గదులు ఉండాలి. థియరీ తరగతులు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ ప్రక్రియ, వాహన మెకానిజమ్, ప్రజాసంబంధాలు, ప్రాథమిక చికిత్స విషయాలపై పాఠాలు చెప్పేందుకు కంప్యూటర్, మల్టీమీడియా ప్రొజెక్టర్ ఉపయోగించాలి.
- తేలికపాటి , భారీ వాహన శిక్షణ కోసం సిమ్యులేటర్ ఉపయోగించాలి. శిక్షణ కేంద్రానికి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉండాలి.
- రివర్స్, పార్కింగ్, ఎగుడు, దిగుడు ప్రదేశాల్లో డ్రైవింగ్ చేసే నైపుణ్యం పొందడానికి అవసరమైన శిక్షణ ట్రాకింగ్ ఉండాలి.
- అన్ని వాహనాలకు బీమా ఉండాలి.
- అర్హులైన శిక్షకులు ఉండాలి. 12 వతరగతి విద్యార్హత ఉండాలి. కనీసం డ్రైవింగ్ లో ఐదేళ్లు అనుభవం ఉండాలి. మోటార్ మెకానిక్స్ లో వెహికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి.
- అక్రిడేటెడ్ శిక్షణ కేంద్రానికి గుర్తింపు ఇస్తే.. అది అయిదేళ్లు చెల్లుబాటు అవుతుంది. తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలి.
- బయో అటెన్డెన్స్, టీచింగ్ సిబ్బంది, ఈ పేమెంట్స్ వ్యవస్థ ఉండాలి.
ఇలాంటి అన్ని రకాల నిబంధనలు పాటించిన అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన వారు.. మరోసారి ఆర్టీవో ఆఫీసులో రవాణ అధికారుల పర్యవేక్షణలో డ్రైవింగ్ పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదు.