సిసి రహదారికి నిధులు మంజూరు : వీరభద్రగౌడ్
1 min read
సి సి రహదారికి నిధులు మంజూరు చేసినట్లు అలూరు టిడిపి
హోళగుంద, న్యూస్ నేడు: ఇన్చార్జి వీరభద్ర గౌడ, ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్ర్యూటర్ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించినట్లు వారున్నారు. వాల్మీకి సర్కిల్ నుండి కోగిలతోట రోడ్డు వరకు సిసి రహచారి, మురుగు కాలువ నిర్మాణం దేపట్టుటకు ప్రత్యేక నిధుల ద్వారా సుమారు 2కోట్ల నిధులు మంజూరుకు గురువారం ఉత్తర్వులు వెలబడినట్లు వారు అన్నారు. సిసి రహదారి నిర్మాణం చేపడితే ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుందని వారు తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఆదోని హోళగుంద డబుల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రద్దు కావడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నత అధికారులతో రోడ్డు విషయంపై చర్చించడం జరిగిందన్నారు. ఆదోని హోళగుంద ప్రధాన రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసేందుకు ఉన్నతాధికారులతో ప్రతినిత్యం దర్చించడం జరుగుతుందని రహదారి నిర్మాణ పనులకు కూడా ప్రభుత్వము నాబార్డ్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేసేందుకు అవకాశాలు నిందుగా ఉన్నాయని వారు అన్నారు.