బీసీల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం
1 min read– వై.నాగేశ్వరరావు యాదవ్తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు చేప్పట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఆదోని నియోజకవర్గం లోని కళ్లకుంట సమీపంలో బీసీలతో ముఖాముఖి కార్యక్రమం శ్రీ నారా లోకేష్ గారిఅధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇన్చార్జిలు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బిసిలు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ:తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం.బీసీల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేస్తాం.బిసిలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్ల లో బిసిలకు రిజర్వేషన్ కల్పిస్తాం.నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం.మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తాం.పనిముట్లు అందిస్తాం, చెట్ల పెంపకం కోసం సహాయం, భీమా కల్పిస్తాం.వడ్డెర్ల మైన్లు తిరిగి కేటాయిస్తాం.విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఒత్తిడి లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం.బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.డప్పు కళాకారులని ఆదుకుంటాం.బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం.వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంటు చార్జీలు 8 సార్లు పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ చార్జీలు 100కు పైనే ఉన్నాయి. నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇంటి పన్ను చెత్త పన్ను రకరకాల పనులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాకే ఇలాంటి పన్నులు ఉన్నాయా అని అనిపిస్తుంది. పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును ఏంచుకున్నాము. తెలుగుదేశం పార్టీ ఏర్పడంగానే పెంచిన ధరలన్నీ తగ్గించి సామాన్య ప్రజలకు అండగా నిలుస్తాం. ఆరు లక్షల మందికి పెన్షన్లు తీసుకువెళ్ళడం జరిగినది వాటిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే వీటిని కూడా తిరిగే అందిస్తాం. విద్యుత్ చార్జీలు పెంచి, అధికంగా విద్యుత్ని ఉపయోగించారని రేషన్ కార్డులను కట్ చేస్తున్నారు. ఇలా రేషన్ కార్డును కట్ చేస్తే మనకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. గొర్రెల పెంపకదారమే జీవంగా సాగిస్తున్న కుటుంబాలకు ఎక్కువ లోన్లను ఇచ్చి వారికి అండగా నిలుస్తాం. జనాభా నిష్పత్తి ప్రకారం ఆ జనాభాకు తగిన నిధులను కేటాయించి వారికి అండగా నిలుస్తాం.