అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, డీఎస్పీగా జి.వి కృష్ణారావు బాధ్యతలు
1 min read

అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయంగా ఈ నెంబర్ కు9440441657 ఫోన్ చేయగలరు
సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాo
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా జి.వి. కృష్ణారావు ఏలూరు లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఎస్‌ఐ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పనిచేశారు. తదనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పెరవలి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. తరువాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోలోపనిచేశారు. 2020 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో డిఎస్పీగా పనిచేసి తరువాత పాలకొండ ఎస్ డి పి ఓ గా, ఏపీ ఎస్ పి 8వ బెటాలియన్ లో డి.ఎస్.పిగాపనిచేసి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా, ఏలూరు కార్యాలయములో బాధ్యతలు స్వీకరించినారు. అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయముగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని కోరినారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అంతే కాకుండా డి.ఎస్.పి మొబైల్ నెంబర్ 9440441657 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేసారు.

