NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిలకలూరులో గడప గడపకు కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండలంలోని చిలకలూరు గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నవరత్నాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే ముఖ్యంగా కృషి చేస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని ఇప్పటికే దాదాపు 90% పైగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా మరికొన్ని సంక్షేమ పథకాలు నెరవేరస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. వాలంటీర్ల ద్వారా గ్రామాలలో నెల మొదటి తేదీన నే పింఛన్దారులకు ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులు పలు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు గంగుల మనోహర్ రెడ్డి మండల నాయకుడు గంధం రాఘవరెడ్డి గ్రామ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి మండల మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి చంద్రారెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి పార్థసారధి రెడ్డి మాజీ సర్పంచ్ ఉసేనషా తహాశీల్దార్ వెంకటశివ ఎంపీడీవో మధుసూదనరెడ్డి పంచాయతీరాజ్ ఏఇ వెంకటరాముడు ఈవోపీఆర్డి భాగ్యలక్ష్మి విద్యుత్ ఏఇ గంగుల రాఘవేంద్ర రెడ్డి ఎంఈఓ వెంకటరామిరెడ్డి హౌసింగ్ ఏఈ మూర్తి వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ పశువైద్యాధికారి మనోరంజన ప్రతాప్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రమోద్ తోపాటు అధికారులు సిబ్బంది వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author