గానగంధర్వుడికి.. ఘన నివాళి
1 min read11న ఘంటసాల వర్ధంతి
- మూడు రోజులపాటు ఆరాధనోత్సవాలు
కర్నూలు, పల్లెవెలుగు:గానగంధర్వుడు ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని టీజీ కళాక్షేత్రంలో ఘంటసాల ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. టి.జి. కళాక్షేత్రానికి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రసమయి సంఘం వ్యవస్థాపకుడు రాము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్, ప్రముఖ సింగర్ రమణ, రిటైర్డు ఎస్బిఐ ఆఫీసర్ సత్య నారాయణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, సంగీత , సాహిత్యం, సంగీత థెరపి తదితర మ్యూజిక్ కు సింగర్ రమణ పాట పాడి …వీక్షకులను అలరించారు. అనంతరం డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఘంటశాల ఆరాధన మహోత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆహ్లాదకర సంగీతం వల్ల హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. మనిషి ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుందని, అప్పుడప్పుడు సంగీతం వినాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు.