రోడ్లపై చెత్త వేస్తే.. భారీ జరిమాన..
1 min read– స్వచ్ఛ కర్నూలు నిర్మాణం మనందరి బాధ్యత
– నగర పాలక కమిషనర్ డీకే బాలాజి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : నగరంలోని రహదారులపై చెత్త వేస్తే భారీ జరిమానాలు తప్పవని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. నగరంలో రాత్రి సమయాల్లో చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు ముగిశాక దుకాణాల్లోని చెత్తను రహదారులపై పారబోస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు పగలు, రాత్రి రహదారులను నిత్యం శుభ్రం చేస్తున్నప్పటికీ…కొందరు వ్యాపారులు చేస్తున్న ఇలాంటి బాధ్యతారహిత, అనాలోచిత చర్యల వల్ల పారిశుద్ధ్య నిర్వహణ లోపం కనబడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, డిప్యూటీ కమిషనర్ పద్మావతి, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ నగరంలోని మెడికల్ కాలేజ్, సర్వజన ఆస్పత్రి, కాలెక్టరేట్, పాత రవి టాకీస్, సెంట్రల్ ప్లాజా, లక్ష్మీ గార్డెన్స్ వరకు పర్యటించి…ఈ ప్రాంతాల్లో ఉన్న కమర్షియల్ దుకాణాల నిర్వాహకులు రాత్రి సమయం వ్యాపారం ముగిశాక ఇలా చెత్తను రోడ్లపై వేస్తున్న వారిని గుర్తించి సదురు యజమానులకు రూ.36,200 జరిమానాలు వసూలు చేశారు. కలెక్టరేట్, డీసీసీబీ బ్యాంకు మధ్య ఉన్న చిన్నపాటి గల్లీ స్థలంలో పక్కనే ఉన్న సాయి ఈశ్వర్ హోటల్ నిర్వాహకులు భోజన వ్యర్ధాలను వేస్తుడం గుర్తించి వారికి జరిమానా విధించారు. ముఖ్యంగా కాలెక్టరేట్ పక్కల ఉన్న టి దుకాణాల నిర్వాహకులు టీ కప్పులను ఎక్కడబడితే అక్కడ పరబోస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. మీనాక్షి బార్ నిర్వాహకులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ గ్లాసులు, మందు సీసాలు రహదారులపై ఎక్కడబడితే అక్కడ వేయడం, అపరిశుభ్ర వాతావరణం ఉన్న కారణంగా వారికి రూ.20,000 జరిమానా విధించారు. పెదాస్పత్రి ఎదుట ఉన్న చాలా మందుల దుకాణాల యజమానులు టాబ్లెట్స్ బాక్సులు, కవర్లు, రహదారులు పడివేయడంతో వారి నుంచి వాటిని తొలగింపజేశారు. అలాగే రమ బేకరీ వారు తమ దుకాణం పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ స్థలంలో బేకరీ వ్యర్ధాలను వేయడంతో వారికి రూ.5000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. వ్యాపారులు పద్ధతి మార్చుకోకపోతే సదురు దుకాణానికి ఉన్న ట్రేడ్ లైసెన్స్ ను క్యాన్సల్ చేస్తామని నగర పాలక కమిషనర్ బాలాజీ గారు స్పష్టం చేశారు. హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ శేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారు.