గౌతమ్ సవాంగ్ ను వాడుకుని వదిలేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం తీరు పై టీడీపీ నేత వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డీజిపి గౌతమ్ సవాంగ్ ను జగన్ ప్రభుత్వం కరివేపాకుల వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. సీఎం జగన్ ది యూజ్ అండ్ త్రో పాలసీ అని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. మాజీ డీజీపీ సవాంగ్‌ను సీఎం జగన్ కరివేపాకులా వాడుకొని తీసేశారని వర్ల మండిపడ్డారు. ఐపీసీ రూల్స్ పక్కన పెట్టి మరీ జగన్ కోసం సవాంగ్ పనిచేశారని, గౌతమ్ సవాంగ్ విషయం అందరికీ గుణపాఠం కావాలని వర్ల రామయ్య అన్నారు. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాష్, పీవీ రమేష్‌ను వాడుకొని విసిరిపడేశారని వర్ల ఆరోపించారు.