PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టూడెంట్ కోసం లింగ మార్పిడి చేయించుకుంది !

1 min read

పల్లెవెలుగువెబ్ : స్కూలు టీచర్ తన స్టూడెంట్ ను పెళ్లాడేందుకు లింగ మార్పిడి చేయించుకున్న ఆశ్చర్యకరమైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. మీరా కుంతల్ భరత్ పూర్ లోని ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తోంది. అదే స్కూల్లో చదువుతున్న కల్పనా ఫౌజ్దార్ అనే అమ్మాయితో మీరా ప్రేమలో పడింది. కల్పనతో జీవితం పంచుకోవాలని బలంగా నిశ్చయించుకున్న మీరా… ఎంతో రిస్క్ తీసుకుని లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారింది.

About Author