సర్వసభ్య సమావేశం..
1 min read
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల గౌరవ అధ్యక్షతనలో అమ్రేష్ గౌడ్,వైస్ ఎంపీపీ రామలింగయ్య స్వామి(బుజ్జి స్వామి), లిఖిత,కోబ్ కో ఆప్షన్ మెంబర్ మహబ్ సాబ్, ఎంపిడివో సుబ్బరాజు,ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పౌరులు కృషి చేయాలని ఆయన కోరారు. రెవిన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ రామయ్య మాట్లాడుతూ రీ సర్వే సంబంధించిన సమస్యలు,ఇతర భూమి సమస్యలు పై ఆయన వివరించారు.అగ్రికల్చర్ అరుణ కుమారి మాట్లాడుతూ రబీ క్రాప్ బుకింగ్ గురించి,పీఎం కిసాన్ గురించి వివరించారు.విద్యుత్ శాఖ అధికారి నరసన్న కరెంట్ పోల్, ఇతర సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో ఎల్ఎల్సి అసిస్టెంట్ ఇంజనీర్ ఈశ్వర్, నాగ మల్లయ్య,సత్యన్న, సర్పంచ్ పాల్ దివాకర్, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.