ఘంటసాల.. దైవాంశ సంభూతుడు
1 min readరాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువనేత టీజీ భరత్
పల్లెవెలుగు వెబ్: మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు దై వాంశ సంభూతుడని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సునాయన ఆడిటోరియంలో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘంటసాల శత జయంతి సందర్భంగా శతాబ్ది గాయకుడికి స్వరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ,ప్రముఖ వైద్యులు డాక్టర్ డబ్ల్యూ సీతారాం ,డాక్టర్ శంకర శర్మ ,డాక్టర్ చంద్రశేఖర్,కె.వి.సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ కల్కురా, కార్యక్రమం నిర్వా హకులు వాసుదేవ మూర్తి ,జగన్నాధ గుప్తా, నరసింహారెడ్డి, ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటల రూపంలో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు .ఘంటసాల శత జయంతి సందర్భంగా ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో శతాబ్ది గాయకుడికి స్వరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన పాటలను పాడటం అభినందనీయమని చెప్పారు. ఘంటసాల కు గొంతు సమస్య వచ్చినప్పటికీ కష్టపడి పాటలు పాడి పాటల పట్ల ఆయనకున్న అభిమానాన్ని తెలియజేశారని చెప్పారు. ఘంటసాల పాడిన పాటలను పాడటం ద్వారా ఈ తరం గాయకులు ఆయన గాన మాధుర్యాన్ని గుర్తు చేయడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు జిల్లా కళలకు నిలయమని కళాకారులను ఆదరిస్తారని చెప్పారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ మాట్లాడుతూ సంగీతం అనేది దేవుడిచ్చిన వరమని అది అందరికీ సాధ్యం కాదని చెప్పారు. ఘంటసాల గాన మాధుర్యాన్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఆయన వివరించారు. ఘంటసాల గానం చేసిన పాటలను వింటే మనసు హాయిగా ఉంటుందని వివరించారు. పాటలు వినడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు నయం అవుతున్నాయని వైద్యులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు .మనిషి వత్తిళ్లలో ఉన్నప్పుడు పాటలు వినడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చు అని వివరించారు. ఈ తరం గాయకులు ఘంటసాల ను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ గాయకులుగా ఎదగాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ,యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఘంటసాల గాన కళా సమితి తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రముఖ గాయకులచే ఏర్పాటుచేసిన ఘంటసాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.