NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యవసర పరిస్థితులలో బాలికలు,మహిళలు శక్తి యాప్ వినియోగించాలి

1 min read

శ్రీ సురేష్ బహుగుణ స్కూల్లో విద్యార్థిని,విద్యార్థులకు మహిళలకు మహిళా చట్టాల పై అవగాహన కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు యొక్క ఆధ్వర్యములో శక్తి టీం సభ్యులు ఏలూరు అమీనా పేటలో శ్రీ సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సి ఆర్ రెడ్డి బి.పార్మసి కాలేజీ లలో మరియు అన్ని ప్రాంతాలలో ఉన్న స్కూల్ లలో విద్యార్థి,విద్యార్థిని లకు మహిళా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమమును  నిర్వహించినారు.విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాలపై మహిళా ఎస్ఐ నాగమణి తో అవగాహనను కల్పించినారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ గారు దసరా పండుగ సందర్భంగా సుమారు 10 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు నేపథ్యంలో శక్తి యాప్ (SHAKTI App) ఒక మహిళా భద్రతకు సంబంధించిన అత్యవసర స్పందన (Emergency Response) మొబైల్ అప్లికేషన్. దీనిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసింది. ఇది ముఖ్యంగా మహిళలు మరియు బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు రూపొందించబడింది అని,ఏది అయినా అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ను  ఉపయోగించిన ఎడల లేదా డయల్ 112 కు సమాచారం అందించిన ఎడల. దీని ద్వారా సమీప పోలీస్ గస్తీ  బృందం తక్షణమే మీ వద్దకు  చేరుకోగలదు అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు స్రవంతి, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి మరియు అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author