PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 వారాల్లో సమాచారం ఇవ్వండి

1 min read

–కృష్ణాజిల్లా రిజిష్టారు పి.ఉపేంద్రరావును ఆదేశించిన సమాచార కమీషనర్ ఐలాపురం రాజా
– ఫిబ్రవరి 8 వ తేదీన స్వయంగా కమీషన్ ముందు హాజరుకండి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా జిల్లా రిజిష్ట్రారు పి.ఉపేంద్రరావును 2 వారాల్లో సమాచారం ఇచ్చి , ఫిబ్రవరి 8 వ తేదీన స్వయంగా కమీషనర్ ముందు హాజరు కావాల్సింది గా రాష్ట్ర సమాచార కమీషనర్ ఐలాపురం రాజా ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణాజిల్లా , ఉయ్యూరుకు చెందిన స.హ.చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ది.06-03-2017న జిల్లా రిజిష్ట్రారు కార్యాలయాన్ని సమాచారం కోరగా , సమాచారం ఇవ్వనందున సమాచార కమీషనర్ పై ఉత్తర్వులను జారీచేశారు. కృష్ణాజిల్లాలోని జిల్లా రిజిష్ట్రారు కార్యాలయం పరిధిలో తప్పుడు రిజిస్ట్రేషన్లు , తప్పుడు దస్తావేజులపై వచ్చిన ఫిర్యాదులు , ఆ ఫిర్యాదులపై 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 81 , 82 , 83 ల ప్రకారం తీసుకున్న చర్యలు , నమోదు చేసిన క్రిమినల్ కేసుల సమాచారాన్ని శ్రీనివాసగౌడ్ కోరగా , సమాచారం ఇవ్వనందున , రాష్ట్ర సమాచార కమీషనరుకు 18-04-2017న ఫిర్యాదు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవటం కారణంగా హైదరాబాద్ సమాచార కమీషన్లో ఉన్న కేసుల రికార్డులు ఇప్పుడు ఆంధ్ర సమాచార కమీషకు రావటంతో 2016 , 2017 సంవత్సరాల కేసుల విచారణ ఇప్పుడు జరుగుతుంది. కృష్ణాజిల్లాలో అనేక సబ్ రిజిష్ట్రారు కార్యాలయాల్లో స్థిరాస్తుల యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుచున్నందున , ఫిర్యాదులపై రిజిస్ట్రేషన్ యాక్ట్ ని సెక్షన్ 81 , 82 , 83 ప్రకారం జిల్లా రిజిస్ట్రారు చర్యలు తీసుకోవాల్సివుంది . జిల్లా రిజిస్ట్రారును రాష్ట్ర సమాచార కమీషనర్ ముందు ఫిబ్రవరి , 8 వ తేదీన స్వయంగా హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.

About Author