PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా గోవర్ధన పూజ

1 min read

– గోవర్ధన పూజ తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు
పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: మండలం కొండపేట గ్రామంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం( ఇస్కాన్) భజన మందిరం లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గోవర్ధన పూజను ఇస్కాన్ భక్తులు కమిటీ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఐదు వందల సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన వేళ్ళతో పైకెత్తి ఎంతో మందికి ఆశ్రయం కల్పించి ఆదుకున్న పరమాత్ముని గురించి గోవర్ధన పూజ ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఇందులో భాగంగా కొండపేట ఇస్కాన్ భజన మందిరం లో గోవర్ధన పూజ వైభవంగా నిర్వహించారు. ఇస్తాం భక్తులు ఆహార పదార్థాల తయారుచేసిన గోవర్ధన పర్వతం భక్తులకు ఎంతో ఆకట్టుకుంది. హరే కృష్ణ హరే రామ అంటూ కీర్తనలు మారుమ్రోగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గోవర్ధన పూజ ఆహార పదార్థాలను భక్తులకు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

About Author